10 February 2011

కొంత

కొంత నిద్రని
బహుమతిగా ఇవ్వు
కొంత శాంతిని
నీలోంచి పంచి ఇవ్వు
కొంత ఇష్టాన్నీ
నేను కోల్పోయిన
కొంత సమాయాన్నీ
నాకు
తిరిగి తెచ్చివ్వు

పొద్దు కుంగుతుంది
మనస్సు
ఇంకుతుంది

కొంత విరామం ఇవ్వు
కొంత చల్లటి
కాంతిని ఇవ్వు

నీకు ఆజన్మాంతం
పద రుణగ్రస్తుడినై
నీతో ముడిపడి
విడివడి ఉంటాను=

No comments:

Post a Comment