మొదట
జీవితం అనేది
ఏదో ఉంది
ఆ తరువాత
రాయటం అనేది
ఏదో ఉంది
అటుపిమ్మట
త్రాగడం అనేది
ఒకటి ఉంది
ఒకటిలో రెండుగా మారి
రెండు నుంచి
అనేకంగా చీలిపోయి
రాలిపడిపోయే విషాదం
ఏదో ఉంది=
అందరూ ఉండి
ఎవరూ లేక
అందరూ ఉండి
బ్రతకడం ఎలాగో తెలియక
బ్రతకరాక
ప్రాణం పోక
ఒక్కడినే కూర్చుని
అందరి దుఃఖాలను
ఒక్కటై రోదించే
ఈ జన్మ పాపం
పుణ్యం ఏదో
చుట్టుకునే ఉంది=
ఒక పవిత్ర పాపం
ఒక అపవిత్ర వరం
ఒక ప్రేమ
ఒక ద్వేషం
ఒక నయనం
ఒక పాదం
నాకు తెలిసీ తెలియని
గానం ఏదో
ఇంకా వెంటాడుతూనే
ఉంది=
మరణ మంత్రమేదో
జీవన తంత్రమేదో
ఏదో, ఏదో ఉంది
ఏదో ఏదో
కదులాడుతూనే ఉంది
మరో జననం దాకా
మరో మరణం దాకా=
baavundi :)
ReplyDelete