"చిన్నదే, గుప్పెడంతేనేమో. ఎడమవైపు ... మరి అక్కడే ...నొప్పి. ఎవరో కత్తి దింపి మెలి తిప్పినట్టు ... మాటి మాటికీ పెదాలు ఎండిపోయినట్టు ... నీళ్లు లేక చచ్చిపోతున్నట్టు ... నువ్వు గుర్తుకు వచ్చినట్టు కూడా... మరి ఏం చేయను?" అని కళ్ళల్లో మంచుతో నీళ్లతో నిప్పుతో, జలదరించే చెట్లతో హోరున వీచే గాలితో ధూళితో, మబ్బులు పట్టి నీడలు వ్యాపించి, మసక కాంతై చినుకులై వానై చెల్లాచెదురైన పూలపందిరై ఒకటే అడుగుతోంది అతనిని ఒక అమ్మాయి -
***
అతని చేతిలో తన అరచేయి తడిచిన పిచ్చికై: వణుకుతో, ఎవరూ లేక, ఎటూ పోలేక, ఉండాలేకా వెళ్లిపోలేకా, అక్కడక్కడే తచ్చాట్లాడుతూ, గొంతుకు ఏదో అడ్డం పడి లోపల ఏదో త్రవ్వుకుపోయి, తండ్లాటై అక్కడే మిగిలిపోతే ...
***
దూరంగా ఎక్కడో ఎగిసే గోధూళిలో కుంగే వెలుతురు. నేలలోకి ఇంకే నీడలు. రాళ్లు. వాలిపోయిన పూలు. తెగిన ఆకులు. ఇక ఎక్కడో, బొట్టుబొట్టుగా నెత్తురు రాలే రాత్రి చప్పుడు -
No comments:
Post a Comment