దాల్చిన చెక్క వాసన అప్పుడు నీలో,
కొన్ని రొట్టెలూ, కొంచెం నీళ్ళూ
ఇంకొంచెం గాలీ, నేలా నిప్పూ: నీలో
పొలం గట్టున నిలబడి, తిరిగి వచ్చే
కొంగల గుంపును చూసినట్టో,
మరి విన్నట్టో, అల్లాగే ఆ ఒడ్డున ఇక
ఒరిగిపోయి, రాత్రిలోకీ, చుక్కలలోకీ
నిద్రలోకీ నీలోకీ,నీ కలలలోకి
జారిపోయినట్టో నావై తేలిపోయినట్టో!
***
పురావర్షాలకు తడిచిన చల్లని వాసన
అప్పుడు నీలో; పలుమార్లు
మరణించినట్టూ, పలుమార్లు నీలోనే
జన్మించి, నన్ను నేను మరచినట్టు!
No comments:
Post a Comment