తుమ్మెదలు లేవు, పుష్పాలూ లేవు
నలువైపులా నలుగు దిద్దుకున్న నీ
మాటలూ లేవు
పచ్చటి చెట్లూ లేవు - ఎగిరే పిట్టలూ లేవు
నింగిన వేలాడే కరిమబ్బుల
జలతారు పరదాలూ లేవు-
ఊదిన వేణువులూ లేవు. మరి ఇక అన్నా
మరువలేని గోధూళులు లేవు
తాగుదామంటే మరిక, అన్నా
ఈత కల్లూ లేదు నాటు సారా లేదు
ఎండ బెట్టి వండుకున్న
సెలయేటి చేపలూ లేవు:
అంతా లోహ ఖగోళం లోహ వలయం
లోహ మోహ తాపం - తంత్రీ నినాదం.
చెప్పు అన్నా - ఇంతకూ
నా ఎదలోని వెన్నెలని
ఇనుప గోళ్ళతో తన్నుకు వెళ్లి
నన్ను నెత్తురు కూడుగా మార్చింది ఎవరు?
నలువైపులా నలుగు దిద్దుకున్న నీ
మాటలూ లేవు
పచ్చటి చెట్లూ లేవు - ఎగిరే పిట్టలూ లేవు
నింగిన వేలాడే కరిమబ్బుల
జలతారు పరదాలూ లేవు-
ఊదిన వేణువులూ లేవు. మరి ఇక అన్నా
మరువలేని గోధూళులు లేవు
తాగుదామంటే మరిక, అన్నా
ఈత కల్లూ లేదు నాటు సారా లేదు
ఎండ బెట్టి వండుకున్న
సెలయేటి చేపలూ లేవు:
అంతా లోహ ఖగోళం లోహ వలయం
లోహ మోహ తాపం - తంత్రీ నినాదం.
చెప్పు అన్నా - ఇంతకూ
నా ఎదలోని వెన్నెలని
ఇనుప గోళ్ళతో తన్నుకు వెళ్లి
నన్ను నెత్తురు కూడుగా మార్చింది ఎవరు?
No comments:
Post a Comment