ఒక మాయా
వెలుతురులో నువ్వు కూర్చుని ఉంటే
ఒక నిశ్శబ్ధంతో నీకు ఎదురు పడతారు. ఇక
ఇక ఇదంతా ఏమిటంటే, ఏమీ లేదు. దీపం వెలిగించిన ఆ వేళ్ళనీ చేతులనీ చూసావా నువ్వు అని
మామూలుగా అడుగుతాను నేను, ఈ భూమి
---
*My word for Air hostesses.
దిగి వస్తారు
గాలి కన్యలు పుష్పక విమానాల లోంచి.
రెపరెపలాడుతుంటాయి అప్పుడు వాళ్ళ ముఖాలు
అలసటతతో. నువ్వు ప్రయాణం చేసినంత మేరా, నువ్వు చూసిన వాళ్ళ కళ్ళ మెరుపుల వెనుక
రెపరెపలాడుతుంటాయి అప్పుడు వాళ్ళ ముఖాలు
అలసటతతో. నువ్వు ప్రయాణం చేసినంత మేరా, నువ్వు చూసిన వాళ్ళ కళ్ళ మెరుపుల వెనుక
అప్పుడు, కొంత ఇంటి బెంగ కనపడుతుంది. మరి
నుదుటిని తుడుచుకునే వాళ్ళ అరచేతుల వెనుక
అప్పుడు నీకు, ఎదురుచూసే కొన్ని పసికళ్ళూ, చిట్టి చేతులూ, చిన్ని పదాలూ, వాళ్ళ ఇళ్ళల్లో మోగే
వాళ్లకి బాగా సుపరచితమైన శబ్దాలూ వినపడతాయి
అప్పుడు నీకు, ఎదురుచూసే కొన్ని పసికళ్ళూ, చిట్టి చేతులూ, చిన్ని పదాలూ, వాళ్ళ ఇళ్ళల్లో మోగే
వాళ్లకి బాగా సుపరచితమైన శబ్దాలూ వినపడతాయి
నువ్వు చూసిన
నవ్వుతున్న ఆ పెదాలలోంచి
అప్పుడు నీకొక
నిట్టూర్పూ,
ఇంకొంత హడావిడీ
కనపడుతుంది:
వడివడిగా బయటకి సాగే వారి
పాదాల వెనుక, అప్పటిదాకా నువ్వు గమనించని, వయస్సుడిగి నిరీక్షించే వాళ్ళ తల్లులూ తండ్రులూ
పాదాల వెనుక, అప్పటిదాకా నువ్వు గమనించని, వయస్సుడిగి నిరీక్షించే వాళ్ళ తల్లులూ తండ్రులూ
ఒక నిశ్శబ్ధంతో నీకు ఎదురు పడతారు. ఇక
నువ్వు ఏం
చేస్తావంటే ఆ గాలికన్యలు
వెడుతూ
వెడుతూ, తమ చీర
కొంగులతో కొంత శుభ్రపరచిన ఆ ప్రపంచాలలో, కాలాలలో కూర్చుని, నిన్ను
మరి కొంతగా
చైతన్య పరిచినందుకు,
వాళ్ళు
వొదిలి వెళ్ళిన
చల్లని కాంతిలోంచి వాళ్ళని కొంత
అబ్బురంగా చూస్తూ
వాళ్లకి ప్రణామం చేస్తావు-
మరి ఇటువంటి
పదాలలో, ఇటువంటి పదాలతో.
ఇక ఇదంతా ఏమిటంటే, ఏమీ లేదు. దీపం వెలిగించిన ఆ వేళ్ళనీ చేతులనీ చూసావా నువ్వు అని
మామూలుగా అడుగుతాను నేను, ఈ భూమి
దీపశిఖను కాపాడే
అ రెండు అరచేతుల మధ్య
భద్రంగా దాక్కుంటూ, ముడుచుకుని పడుకుంటో-
------------------------------భద్రంగా దాక్కుంటూ, ముడుచుకుని పడుకుంటో-
*My word for Air hostesses.
No comments:
Post a Comment