ఉదయాన్నే/ ముఖ తెరలపై/ నాలికని పదను పెట్టుకునే పిలగాడా/ దా ఇలా
నీళ్ళు తాపిన/ పుంజు మెడను/ పట్టుకున్నాను వెనక్కు వంచి./ఆ/ వలయపు కుత్తుకపై/ మెత్తగా/ పెట్టొక కత్తి గాటు./ రాలతాయి ఇక/ ఎర్రటి పూలు/ కొమ్మలు వలవలా కదిలి/ నిన్ను కన్నీళ్ళమయం చేసిన/గాలి/ ఎక్కడో వీచి-/ అది స్సరేలే
తెస్తాను నేను/ నీకు/ ఇప్పపూల సారా ఆకుపచ్చని పొగాకూ/ కానీ/ ఒరే/ ఒరోరే/ ఓ పిలగా
మూడ్రాళ్ళేసి
వాటి మధ్యగా
ఓ స్త్రీని రాజేసి
నీ/ నా/ ఈ/ నాటు హృదయాన్ని/ వండి / సంధ్య వార్చి/ మనకి/ వడ్డించేది ఎవరు?
No comments:
Post a Comment