అరణ్యాలలోంచి వచ్చిన, నక్షత్రాలు మెరిసే ఒక పద్మానివి నువ్వు.
మంచులో నానిన ఉదయంపై
ప్రసరించిన లేత ఎండ నువ్వు
ఇంకా ఆకలిగొన్న కడుపుని
ఎత్తుకుని, ఛాతిలో దాచుకుని శిశువుకి పాలిచ్చిన తల్లివి నువ్వు-
నీకు ధన్యవాదాలు తెలపడం ఎలా?
అని నేను విభ్రాంతితో అడిగితే ఇలా
చెప్పింది, మనం ప్రతీకలలలో సమాధి చేసిన ఒక బంగారం ఇలా
ఇల్లాగే, చెప్పింది నా పదాలలో:
"ఎందుకో రాస్తావు పూలు గురించీ?
రాళ్ళుగా మారిన కాళ్ళు, కాళ్ళుగా మారి పగిలిన ఈ అరచేతులూ
బట్టలు ఉతికీ అంట్లు తోమీ, టాయిలెట్ కడిగీ కడిగీ
నీకు వండీ వండీ నీతో పడుకునీ పడుకునీ తడిలేక
పగిలిన పెదాలైన నా యోని ప్రేమ గురించీ మరి ఎందుకో రాయరు
మీ కవులు మరి మహాతాదాత్మ్యంతో, నును లేత
పోలికలతో, మబ్బులతో, ఆకాశంతో
వసంతాలతో వానలతో ఎప్పుడూనూ?"
ఆ తరువాత ఈ కొండలలో రాత్రంతా వర్షం కురిసింది.
చీకట్లో, ఒక దీపంలా వెలుగుతూ
తను నా ఎదురుగా కూర్చుంటే
గది అంతటా పచ్చి గడ్డి వాసన. కన్నీళ్ళలో తడచిన
వెదురు వనాల వాసన. కొంత
పచ్చి ముళ్ళ నెత్తురు వాసన-
తెలుస్తుందా మీకు ఇక్కడ ఆ రాత్రంతా వీచిన, శరీరాన్ని గడ్డ కట్టించే, తన
చేతి వేళ్ళ అంచుల నుంచి వీచే
అనంతాల మంచు ధూపం మరి
మరణం లేని కనుల దహనం?

No comments:
Post a Comment