29 August 2013

I Kissed Her Goodbye

"వొంటరిగా ఉంది ఇక్కడ - నొప్పిగా కూడా ఉంది
ఏం చేయాలో తెలియటం లేదు

చెల్లాచెదురుగా చెదురుమదురుగా కూడా ఉంది
శరీరం ముసురు పట్టింది.పక్షులు
వొదిలి వేసిన గూడును చూసావా

నువ్వు ఎన్నడైనా? ఇదిగో నేను దాచుకున్న ఆ
రంగురంగుల పక్షి ఈక, ఎగరలేదు
ఇక ఇది, గింజలకై  కువకువలాడ

లేదు ఇది. నా లోపల చెట్టుని కొట్టేసినట్టు ఉంది
నీడలు తిరుగాడుతున్నట్టు ఉంది
బెంగగా కూడా ఉంది. ఏం చేయాలో

తెలియటం లేదు. ఏం చేయాలి-?" అని అడిగింది
తనూ, తన తనువూ. ఇక అప్పుడు
రాత్రి చినుకులు చుక్కలతో లోపలికి

విసురుగా వచ్చి గాలితో గదినీ నన్నూ
తడుపుతున్నప్పుడు- it is then that
I gently kissed her Goodbye-మరి

వినపడిందా మీకు? నీళ్ళు ఒలికిన ఆ చప్పుడు-?

8 comments:

  1. నా తలకాయ.యేమీ అర్ధం కాలేదు. దేని గురించి యెవరు యెలా ఫీల్ అవుతున్నారు.ఆఖరికి పంపేసిందెవరిని.అంతా అయోమయం.

    ReplyDelete
  2. hariSbabu@ ROFL. సంతోషం హరిబాబు. నాకూ అర్థం కాలేదు- తలకాయ ఉందో లేదో. నీకో/నాకో-

    ReplyDelete
  3. @ haribabu
    :)

    @srikanth
    Hope the time never heals you.
    పొలిటికల్లీ ఇంకరేక్టే ......కాని అలానే అనిపించింది.

    ReplyDelete
    Replies
    1. @భావకుడన్: LOL. Someone has to grow up here and learn how to 'read': పొలిటికల్లీ ఇంకరేక్టే కానీ, కాని నాకూ అలానే అనిపించింది. By the way, how did the text begin? When do we use quotation marks? When did those quotation marks end in the text? ఇంకన్నూ 'అర్థం' కాకపోతే, ఇదిగో ఇలా అనుకుని వదిలేయండి: 'నా తలకాయ.యేమీ అర్ధం కాలేదు. దేని గురించి యెవరు యెలా ఫీల్ అవుతున్నారు.ఆఖరికి పంపేసిందెవరిని.అంతా అయోమయం.'

      Delete
  4. :) మొన్నీ మధ్యే ఒకరితో చెప్పాను మీరర్ధమయితే ఒట్టు అని.సో పర్లేదు.

    ఈ కామెంటు మీ ఈ ఒక్క కవిత విషయం గురించి కాదు రాసింది. ఉంటాను.

    ReplyDelete
    Replies
    1. భావకుడన్@ Thank you: మీ కామెంట్కి నేను వ్రాసిన జావాబు కూడా ఈ ఒక్క పోస్ట్/పోయం కి సంబంధించినది మాత్రమే కాదు. ఉండను :-)

      Delete
  5. :D naaku ardham ayindi

    MS Amruta

    ReplyDelete