1
వాన వాసన వేసే పూలరేకుల వలే తాకుతాయి
నీ చేతులు, ఈ చినుకులూ
గోప్యంగా తేలొచ్చే
చల్లటి గాలీనూ-
ఆ గాలిలో, ఆ లేత పసుపుపచ్చ కాంతిలో,సీతాకోకచిలుకలు-
ఏ లోకాలను విసురుతున్నాయో
ఆ రెక్కలు కానీ
వెన్నెల కళ్ళాపి జల్లినట్టు, నీ చుట్టూ పచ్చిక కాంతి-
తలలు వాల్చిన
ఆకుల కింద చేరి, ఊయలలూగే నీడలు, వజ్రాలూ
మెరిసే నీ కళ్ళూ-
2
మరి ఏం ఉంది
అప్పుడు నాకు-?
3
సరస్సుల అంచులలో తేలికగా ఊగే అలలపై కదిలే నాచూ
రెక్కలూపక ఆ వెలుతురులో
అలా నిశ్చలంగా తేలే
తూనిగల నిశ్శబ్ధమూ
నాలో: ఒక శిశువు
ఊయలూగుతూ, నిద్రలోకి జారుకున్నంత మెత్తదనం
పెదవిపై మిగిలిన
పాల తడి వంటి
ఒక ఇష్టమూనూ-
కానీ మరి ఇదంతా
ఏమిటీ అని అంటే
4
ఏమీ లేదు - ఉన్నదంతా, ఇక మనకు మిగిలినదంతా
ఇక ఇదే ఉదయం
ఇక ఇదే జీవితం-
కొంత నాతో, కొంత నీతో, కొంత ఇలా మనకి మనతో-
కానీ, కన్నా
5
మరి ఇంతకూ
సంధ్యా సమయంలో, కలువ పూల చుట్టూ గుమికూడి
ఒక బిందువులోకి
పునర్యానం
అవుతున్న
ఆ వలయాలను చూసావా నువ్వు?

No comments:
Post a Comment