- మాట్లాడని దీపం ఒకటి, నీ వంటి కాంతితో -
మసి నిండిన రాత్రిలోకి.
అప్పుడు నీ అరచేతులు
మాట్లాడే పూవులు - నన్ను నవ్వే పూవులు -
ప్రతిధ్వనులు.చినుకులు
చిగురించిన వేళలలో
చిన్నగా కదిలి, ఆగే
- పూరేకులు. మసక వెన్నెల ముళ్ళు. రెండు
వేళ్ళ మధ్య నిన్ను ఎవరో
నులిమిన వాసనలు
నా లోకాలని ఊపేసే
నీ లోలకాలు.
పురాగాధలు-
అయినా ఎవరూ రారు ఇక్కడికి: చీకటి రెక్కలు
రిఫ్ఫున వీచే, సీతాకోక
చిలుకల రెక్కలూగి
ఆగిన చోటకి.అలసిన
ఆమన చోటకి/తోటకి /అలలా
విలపిలిపించే ఆ కోట వద్దకి -
అందుకని
O One
O Blue one
Oh Blue blue One of the None
No.
Don't open
the door
- Of you, of me -
- Of you and me -
Look
Lock
Look
- కుత్తుక తెగి నీ గుమ్మంలో రాలి, తల ఎత్తి, ఆఖరి
పదశ్వాసతో నీ వైపు చూసే
ఒక పావురాన్ని
ఇక ఇప్పటికి. మనం. వచ్చేటప్పటిkey.
మసి నిండిన రాత్రిలోకి.
అప్పుడు నీ అరచేతులు
మాట్లాడే పూవులు - నన్ను నవ్వే పూవులు -
ప్రతిధ్వనులు.చినుకులు
చిగురించిన వేళలలో
చిన్నగా కదిలి, ఆగే
- పూరేకులు. మసక వెన్నెల ముళ్ళు. రెండు
వేళ్ళ మధ్య నిన్ను ఎవరో
నులిమిన వాసనలు
నా లోకాలని ఊపేసే
నీ లోలకాలు.
పురాగాధలు-
అయినా ఎవరూ రారు ఇక్కడికి: చీకటి రెక్కలు
రిఫ్ఫున వీచే, సీతాకోక
చిలుకల రెక్కలూగి
ఆగిన చోటకి.అలసిన
ఆమన చోటకి/తోటకి /అలలా
విలపిలిపించే ఆ కోట వద్దకి -
అందుకని
O One
O Blue one
Oh Blue blue One of the None
No.
Don't open
the door
- Of you, of me -
- Of you and me -
Look
Lock
Look
- కుత్తుక తెగి నీ గుమ్మంలో రాలి, తల ఎత్తి, ఆఖరి
పదశ్వాసతో నీ వైపు చూసే
ఒక పావురాన్ని
ఇక ఇప్పటికి. మనం. వచ్చేటప్పటిkey.
No comments:
Post a Comment