ఒడ్డున కూర్చుని, నీళ్ళలోకి రాళ్ళు విసిరి
నవ్వుకుంటూ, మురిసిపోతూ
ఆనందించే వాళ్ళ సంగతి వేరే
కానీ, నీ కళ్ళల్లోకి గాలం వేసి కూర్చునే
నీ వాళ్ళ సంగతీ, ఈ బజార్లల్లోకి
లాగి నిన్ను వేలం వేసే నీ/వాళ్ళ
సంగతీ ఏమన్నా ఉంటే చెప్పు వింటాను-
అది సరే:మరి సంతోషంగా ఉన్నావా నువ్వు
ఇప్పుడు:నాకు లేని సహచరీ
ఒడ్డు దొరకని ఒక మనిషి, నీ
గాలానికి చిక్కుకుని, శ్వాసందక ఇక
పాలిపోయిన అశ్రువు వలే
ఇలా, రాలి/పోయిన నాడు-?
నవ్వుకుంటూ, మురిసిపోతూ
ఆనందించే వాళ్ళ సంగతి వేరే
కానీ, నీ కళ్ళల్లోకి గాలం వేసి కూర్చునే
నీ వాళ్ళ సంగతీ, ఈ బజార్లల్లోకి
లాగి నిన్ను వేలం వేసే నీ/వాళ్ళ
సంగతీ ఏమన్నా ఉంటే చెప్పు వింటాను-
అది సరే:మరి సంతోషంగా ఉన్నావా నువ్వు
ఇప్పుడు:నాకు లేని సహచరీ
ఒడ్డు దొరకని ఒక మనిషి, నీ
గాలానికి చిక్కుకుని, శ్వాసందక ఇక
పాలిపోయిన అశ్రువు వలే
ఇలా, రాలి/పోయిన నాడు-?
No comments:
Post a Comment