అద్దంలో ఒక లిల్లీ పూవుని ఉంచాను
నా శరీరాన్ని త్రవ్వి త్రవ్వి
నెత్తురుని దున్ని దున్ని
ఒక పాదు చేసి, అందులో
నీ ప్రతిబింబాన్ని ఉంచాను
నీకు చినుకులని జల్లి
ఆ ఎండకు ఆనుకుని
అక్కడే పడి ఆదమరచి నిదురపోయాను. మరి
అతను లేచేలోగా
మొక్కకు పూచిన
ఒక చిన్ని పసుపు
సీతాకోకచిలుకను చిదిమి, నిదురించే అతని
కనురెప్పలపై నుంచి
తడి ఆరని పాదాలతో
వీస విసా నడుచుకుంటూ వెళ్లిపోయింది ఎవరు?
నా శరీరాన్ని త్రవ్వి త్రవ్వి
నెత్తురుని దున్ని దున్ని
ఒక పాదు చేసి, అందులో
నీ ప్రతిబింబాన్ని ఉంచాను
నీకు చినుకులని జల్లి
ఆ ఎండకు ఆనుకుని
అక్కడే పడి ఆదమరచి నిదురపోయాను. మరి
అతను లేచేలోగా
మొక్కకు పూచిన
ఒక చిన్ని పసుపు
సీతాకోకచిలుకను చిదిమి, నిదురించే అతని
కనురెప్పలపై నుంచి
తడి ఆరని పాదాలతో
వీస విసా నడుచుకుంటూ వెళ్లిపోయింది ఎవరు?
No comments:
Post a Comment