12 April 2012

శాపం

కళ్ళలో
దహనం కావించబడే పూల వనాలతో

పాత్ర నిండా
ముంచుకున్న చీకటితో, స్వవిషంతో

బ్రతకలేక, బ్రతక రాక
చచ్చిపోనూ లేక
ఏం చేయాలో తెలియక

కదిలే నీడల అంచులను
మునివేళ్ళతో తాకుతూ

ఒక్కడివే కూర్చున్నావా నువ్వు
ఎప్పుడైనా, ఏ రాత్రయినా?

1 comment:

  1. చాలా రాత్రులు ..కూర్చున్నాను...

    ReplyDelete