02 April 2012

ఒక రోజు

ఈ వేళ పచ్చని మొక్కకు
తనువెల్లా రాతి పూవులు

కమిలిన కనులు ఆకులు

ఇక
చినుకులు లేని వానలో
కలలు కరిగే శిలల గాలిలో

తిరిగి తిరిగి రాని
అతడు ఎక్కడికి

వెళ్ళగలడు?

1 comment:

  1. ఆకాశం కింద వున్న......మధుశాల కు....

    ReplyDelete