12 April 2012

ఒక రాత్రి

అద్దంపై మల్లెమొగ్గలు
కూజాలో మంచి నీళ్ళు

కనుల కింద చారలు
అలసిన చేతులు
ఎండిపోయిన పెదాలు

ఎవరో ఇప్పటిదాకా ఉండి
ఇప్పుడే వెళ్ళిపోయిన
ఒక శరీర పరిమళం,
ఒక సుధీర్గ నిశ్శబ్దం-

ఏం చెప్పను ఇంక

హృదయమొక
క్రూర వేటమృగం!

1 comment:

  1. "హృదయమొక
    క్రూర వేటమృగం!"

    hmmm.. so true!

    బావుందండీ.. కవిత మొత్తంగా!

    ReplyDelete