నీ కనులంచున మెరిసే
నిప్పు రవ్వలను మింగీ
యింకా చల్లగానే ఉన్నాను
నిప్పు రవ్వలను మింగీ
యింకా చల్లగానే ఉన్నాను
నీ మాటల విషం నిండుగా తాగీ
ఎందుకో యింకా బ్రతికే ఉన్నాను
హత్తుకునే నీ రెండు చేతులకై
త్రుణప్రాయంగా ధారపోసాను
వీధులలోనన్నునేను
వేలం వేసుకున్నాను
ఈ లోకపు బలిశాలలో
నన్ను నేనే అమ్ముకున్నాను
తల్లి వంటి చీకటి ఒడిలో తల దూర్చి
తనని కావలించుకుని
ఆ రాత్రంతా రోదించాను
నీడలని వెంటాడుతూ
నీడలతో మాట్లాడుతూ
కర్కశ కాలం గడిపాను
యిక ఒక మధుపాత్రలో
నీ మోముని వెలిగించి
హృదయాన్నిఅంటించి
రగిలిపోయాను
విసిగిపోయాను
విరిగిపోయాను
నా నుంచి నేనే పారిపోయాను
విసిగిపోయాను
విరిగిపోయాను
నా నుంచి నేనే పారిపోయాను
ఫరీదా, యిక యింతకంటే
ఎక్కువ చెప్పడం నిషిద్ధం
ఎందుకంటే
గుండె చెక్కుకు పోయి
అర్ధించే వాడి ఆక్రందన
ఆదిమ లోకంలోని అతనికీ
భవంతులలోకూర్చునే
ఒళ్లంతా ముళ్ళున్న
నీ గులాబీ రూపానికీ
నీ గులాబీ రూపానికీ
ఏం తెలుస్తుంది?
ఎలా తెలుస్తుంది?
chala bagundi...keep writining..
ReplyDelete