కూర్చుని ఉంటావు నువ్వు -అక్కడ- ఆ నలిగిన వేళల్లో, ఎవరో వస్తారని.
అప్పుడు, నీ ముఖాన్ని తాకి
నీలో బెంగని నింపే ఒక చల్లటి గాలి. కొమ్మల్లో
తిరిగి వచ్చిన పక్షుల కలకలం సద్దుమణిగి, పూలు రాలే నిశ్శబ్ధంలో
ఎక్కడో దూరంగా ఒక ఇంటిలో వెలిగించబడిన దీపపు కాంతి:
ఇక
నీ చుట్టూ నువ్వు
గట్టిగా చేతులు చుట్టుకుని, నీలోకి నువ్వు ముడుచుకుని
తల తిప్పి చూస్తే, నీ పాదాల వద్ద, ఎక్కడి నుంచో కొట్టుకు వచ్చిన ఒక ఆకు
నీ హృదయం వలే కంపిస్తే
నువ్వు
నీ ప్రాణం కంటే మిన్నగా
నువ్వు ప్రేమించినవాళ్ళెవరో నీకు గుర్తుకు వచ్చి, నీ శరీరం వణికిపోయి
క్షణకాలం నీ గుండె ఆగిపోయినట్టూ
లీలగా
ఆ ముఖం ఆ స్పర్శా ఆ గొంతూ
లిప్తకాలంపాటు నీ సమక్షంలో మెరిస్తే, నీలోంచి నువ్వు తొణికిపోయి
నీలో నువ్వు నలిగిపోయి, పిగిలిపోయి, మౌనమైపోయీ
కూర్చుని ఉంటావు నువ్వు
అక్కడే
ఆ నలిగిన వేళల్లో - కొంత ఉప్పగా కొంత నొప్పిగా -
నిన్ను నువ్వు ఉగ్గబట్టుకుని
ఈ చీకటిని ఎత్తుకుని
ఎవరో ఒకరు వస్తారని, రాత్రిలో మిణుగురులై మెరుస్తారనీ-

ReplyDeleteప్రేమించినవాళ్ళెవరో నీకు గుర్తుకు వచ్చి, నీ శరీరం వణికిపోయి
క్షణకాలం నీ గుండె ఆగిపోయినట్టూ...yes it happens.