"ఇక్కడ - ఎవరికీ ఎవరూ, ఏమీ కారా" అని ఏడ్చింది తను - ఆనాడు.
నాకు బాగా జ్ఞాపకం - ఆనాడు.
పది కిలోమీటర్లు నడిచి, తన గదికి చేరుకుని ఉంటాను - ఆనాడు.
టికెట్కి డబ్బులు లేక, మిగిలిన రూపాయితో బీడీలు కొనుక్కుని
నన్ను నేను తొక్కుకుంటూ, నీడలతో మాట్లాడుకుంటూ
మరో దారి లేక, తన గదికే చేరుకొని ఉంటాను -ఆనాడు-
అశోకా ఆకులు విలవిలలాడుతూ ఉండినై తన గది ముందు - ఆనాడు.
తన గది తలుపుల పూల కర్టెన్, సన్నగా ఊగుతూ ఉండింది - ఆనాడు.
సన్నటి గాలి ఒకటి గదినంతా కమ్మి కన్నీటి వాసన వేస్తూ ఉండింది -
ఆనాడు - పల్చటి ఎండ ఒకటి
తన గదిలో నేలపై, దొర్లుతూ బెక్కుతూ ఉండింది - ఆనాడు. మరచాను
గోడపై ఒక ఏసు క్రీస్తు చిత్రమూ, టేబుల్పై ఒక పూలపాత్రా, ఇంకా
తను తెచ్చుకుని అమర్చుకున్న వెదురు బొమ్మలేవో కాలిపోయి
రాలిపోయేందుకు మిగిలిపోయినట్టు ఉన్నై-ఆనాడు. అవునారోజు
ఆ గదిలో- ఆ మంచంపై
తెల్లని దుస్తులతో, మూలకు గిరాటేసిన ఒక మాంసం ముద్ద వలే
కుత్తుక తెగి కొట్టుకులాడుతున్న కోడిపిల్ల వలే గుండెలు పగిలేలా
గుండెలు చరుచుకుంటూ ఏడుస్తున్న ఒక తల్లివలే, పసిపాపవలే
ఆ గదిలో - ఆ మంచంపై, తనే ఆనాడు
"లంజాకొడుకు. మళ్ళా వచ్చాడు. ధెంగి, ఉన్నదంతా దెంకపోయాడు.
ఇంకేం పెట్టను పిల్లలకి" అంటే, ఒక మూలగా బెదురు బెదురుగా
ఇద్దరు పిల్లలు. నెత్తురు చారికలు. చిరిగిన చీర. తెగిన బ్లౌజు.
విరిగిన గాజులూ. బూటు ముద్ర పడ్డ పొత్తి కడుపు కిందుగా
తుక్కు తుక్కయిన తన యోనిలోంచి
చుక్కచుక్కగా
చుక్కచుక్కగా
చుక్కచుక్కగా
నె
త్తు
రు
"ఇక్కడ - ఎవ్వరికీ ఎవరూ ఏమీ కారు" అని తను
ఒక బండ కేసి బాదుకున్నట్టు
నాకేసి తన తలను కొట్టుకుని
ఏడ్చిననాడు
ఆనాడు-

No comments:
Post a Comment