మరి, ఆ రోజు
వాన కురిసినంతసేపూ తాగుతూనే ఉన్నాను.
మనుషుల మడుగుల్లో, పూల రాపిడుల్లో, ఆకులు రాలి, ధూళి రేగి
కళ్ళల్లో నువ్వు పడి, అవి ఎరుపెక్కే వరకూ -
బహుశా, నన్ను నేను పూర్తిగా మరచిపోదామనుకున్నానేమో: ఆ రోజు
బహుశా నన్ను నేను పూర్తిగా దగ్ధం చేసుకుందామనుకున్నానేమో:
ఆ రోజు. బహుశా, చచ్చిపోదామనుకున్నానేమో ఆ పూటా ఆ రోజు-
లేక
నా శరీరం మొత్తమూ అమృత విషంలా వ్యాపించిన నిన్ను
నా శరీరాన్ని చీల్చి, దానిలోంచి నిన్ను పూర్తిగా పెగల్చివేసి
నీ, నా గతాన్నుంచి విడివడి - శుభ్రపడి -మరొక జన్మ ఎత్తి
నా దారిన నేను బ్రతుకుదామనే అనుకున్నానేమో నేను
అమాయకంగా - ఆ రోజు. మరి ఇక ఏమైతేనేం
ఆ రోజు
వాన కురిసి, వెలసి చివరకు రాత్రితో వెళ్ళేపోయింది.
మనుషుల్లో పడి, పూలమౌనాల్లో మునిగీ, ఆకులతో కొట్టుకుపోయీ, ఎవరైనా
ఇంత మాట్లాడతారేమోనని, దారిన పోయే ప్రతివాళ్ళనీ
బ్రతిమాలుకుని, వెంటబడి అడుక్కుని, చీదరించుకోబడీ
మరి, ఆ రోజు అతని కళ్ళల్లోకి నువ్వు రాలిపడితే
బరువెక్కి, ఎరుపెక్కీ అవి చినుకులతో జారిపోతే
రెండు పసిపాప చేతులై అవి, ఈ లోకంలోకి సాగి
నిన్ను వెతుక్కునేందుకు వెళ్లి, ఎక్కడో తప్పిపోతే
తిరిగి బెంగగా దారి వెతుక్కుంటుంటే, ఎక్కడో నెత్తురోడుతుంటుంటే
మరి, ఆ రోజు
నువ్వు ఎక్కడో, మళ్ళా ఒక గూటిలోకి చేరేదాకా
వాన మళ్ళా కురిసేదాకా తాగుతూనే ఉన్నాను-

No comments:
Post a Comment