"చక్కని మాటలు ఏమైనా చెప్పు" అంది తను
నా చుట్టూ ఉన్న రాత్రినీ, చీకటి ఆకాశాన్నీ
వాటిలో మెరిసే నక్షత్రాలనీ చూపించాను-
"ఆలా కాదు
పూలవంటి మాటలని ఏమైనా మాలగా కట్టు" అంది తను-
నేల రాలిన లతలనీ, చనుబాలు లేని వెన్నెల కనులనీ
శరీరాలు చెక్కుకుపోయిన ప్రేమలనీ చూయించాను-
"పోనీ, ఊరకే
కనీసం వానలాంటి
కనీసం తుంపరలాంటి పదాలనైనా కురవనివ్వు" అంది తను-
లోకం త్రవ్వుకుపోయిన కాలం కాంతినీ
రెక్కలు తెగిన ఒక పావురాన్నీ, కడుపు
డోక్కుపోయిన ఒక పసిపాపనీ, చీరేయబడ్డ
యోనులతో, దిగంతాల ఖాళీ అరచేతులతో
ఎదురుచూపులై నిలిచిన అమ్మలనీ చూయించాను-
వొణుకుతూ, అప్పుడు
"ఇప్పుడు ఇవేమీ వద్దు నాకు. కాసేపు, నువ్వు
నిశ్శబ్ధంగా ఉండు చాలు" అని అంది తను.
సరిగా ఆ క్షణానే
బిగించి పెట్టుకున్న తన అరచేతిని నెమ్మదిగా తెరచి
ఆ నెత్తుటి నెలవంకల ముద్రికలని
ఈ తెల్లని కాగితంపై -మెత్తగా- అద్ది
"చక్కటి మాటలు చెప్పడం
ఎలాగా?" అని, తిన్నగా తనలోకే చక్కగా వెళ్ళిపోయాను నేను!

No comments:
Post a Comment