ఆరిన చితిలోంచి గాలికి ఎగిసిపడే చితాభస్మం వంటి చీకటి -
"ఎలా ఉంటావు నువ్వు ఇలా?" అని తను అడుగుతుంది.
"సాయంత్రానికి పూవులూ వడలిపోతాయి - పిల్లలూ
వడలిపోతారు. పగిలిన పాదాలను వొడిలో పెట్టుకుని
అరచేతులతో నిమురుకుంటూ, స్మృతలలో కోల్పోయే అమ్మలూ అలసటతో సోలిపోతారు-
ఏం చెప్పను? ఇది, ప్రతి మనిషీ ఒక ఎండాకాలమై, దాహార్తియై
మట్టికుండలో చల్లబడిన నీళ్ల వంటి, నీటి స్పర్శ వంటి
మరో మనిషికై తిరుగాడే లోకం. ఎవరూ దొరకని కాలం
మరి ఏం చేయను నేను?" అని అతను అడుగుతాడు -
ఆప్పుడు, అక్కడ - ఆ చీకట్లో, నిశ్చలమైన ఆకులపై కొంత కాంతి. ఎక్కడో మెరిసే నక్షత్రాలు.
ఎవరో ఎండి, పగిలిపోయిన మట్టిపై నీళ్ళు చల్లే
సవ్వడీ. లోపల అన్నం ఉడుకుతున్న వాసనా-
మరొక రోజు. మరొక రాత్రి. అప్పుడు అక్కడ తను
అతని భుజంపై తల వాల్చినప్పుడు, ఎక్కడో మల్లెపూలు విచ్చుకుంటున్న నిశ్శబ్ధం.
తనకి అతను ఎన్నడూ కొనివ్వని మల్లెపూలు
విచ్చుకుని, అతి పల్చగా వీచిన గాలికి, తమ
తెలుపుదనాన్నీ సువాసననీ వెదజల్లే నిశ్శబ్ధం-
ఇక ఆ తర్వాతనా? ఏమీ లేదు. మీకు చెప్పడానికీ కూడా నిజంగా ఏమీ లేదు.
ఊరకే అలా
మరొక రోజు, బ్రతుకుతాను నేను
వాళ్ళిద్దరిలో-

ReplyDeleteఏం చెప్పను? ఇది, ప్రతి మనిషీ ఒక ఎండాకాలమై, దాహార్తియై
మట్టికుండలో చల్లబడిన నీళ్ల వంటి, నీటి స్పర్శ వంటి
మరో మనిషికై తిరుగాడే లోకం. ఎవరూ దొరకని కాలం
మరి ఏం చేయను నేను?" అని అతను అడుగుతాడు - <3