నా అరచేతుల్లో నీ ముఖం: ఇక నా చుట్టూ అప్పుడు
వీచే గాలీ, రాలే ఆకులూ, నీటి వంటి చల్లటి చీకటీ
గూటిలో ముడుచుకుంటున్న
పిచ్చుక పిల్లల రెక్కల సవ్వడీ-
నా అరచేతుల్లో నీ ముఖం: ఇక నా చుట్టూ అప్పుడు
పూవులు, పేరు తెలియని పూవులేవో విచ్చుకుని, నెమ్మదిగా
చీకటినీ చెట్లనీ గాలినీ గూళ్ళనీ
సువాసనతో అల్లుకునే శాంతి-
ఇక, అప్పుడు అక్కడ, నా చేతివేళ్ళని నీ చేతివేళ్ళు తాకినప్పుడు
తల్లి వొడిలో తల దాచుకున్న భద్రతా, తన బొజ్జ చుట్టూ
చేతులు వేసి హత్తుకున్న జ్ఞాపకం.
కొంత ధైర్యం, కొంత ఇష్టం. ఎవరో
జుత్తుని ప్రేమగా చెరిపిన అలజడీ-
నా అరచేతుల్లో, ఈ చీకట్లలో వీచే గాలిలో రాలే ఆకులలో
మట్టిపై చినుకు చిట్లే వాసనలో నీ ముఖం.
ఏంటంటే, ఏమీ లేదు. మరేం పర్వాలేదు-
ఇక ఈ పూటకి,ఇక ఈ రాత్రికి
చినుకుతో ఒక దీపాన్ని వెలిగించుకుని
మరొక రోజు బ్రతుకుతాను నేను-

No comments:
Post a Comment