అర్థరాత్రివేళ ముదురు ఆకుల మధ్య నుంచి బొప్పాయి పూలు నిశ్శబ్దంగా
ఆకాశపు తటాకంలోని జాబిలిని చూపిస్తాయి
తల ఎత్తలేని, నల్లటి మట్టిలో సమాధిని తవ్వుకునే
నిర్లిప్తపు బాటసారికి -
అతడు ఈ రాత్రి, ఈ భూమిలో తన ఎముకలని నానబెట్టుకోవాలి.
పుర్రెలాంటి తన ముఖాన్ని మట్టి పొరల దోసిళ్ళలో దాచుకోవాలి.
వడలిపోయిన పాదాలను వృక్షాల వేళ్ళతో
జతవేసుకుని విశ్రమించాలి.ఇక ఈ లోపల
అలసిన కొమ్మల మధ్యనుంచి తెలియనిది ఏదో
అనంతపు శూన్యం నుంచి ఇక్కడికి
కదలి వస్తుంది. చెట్లలోంచీ గాలిలోంచీ
ఇక అదృశ్య పాదాల సవ్వడి. రహస్య కనుల అలికిడి: నల్లటి మంచు బొట్లు
చుట్టూతా కురిసే వేళల్లో, చీకట్లో శూన్యాన్ని
ఖడ్గంతో నరికిన, రివ్వున ఎగిరి వెళ్ళిపోయే
ఉక్కు పక్షి రెక్కల సవ్వడి-
అది, ఆదీ అనంతం అయిన
మృత్యువిహంగపు మెత్తటి గోరు వెచ్చటి తాకిడి. ఇక ఆ తరువాత కూడా
అర్థరాత్రివేళ ముదురు ఆకుల మధ్య నుంచి బొప్పాయి పూలు నిశ్శబ్ధంగా
ఆకాశపు ఎడారిలోని జాబిలిని చూపిస్తాయి
తల ఎత్తలేని, నల్లటి మట్టిలో సమాధిని తవ్వుకునే
నిర్లిప్తపు బాటసారికి-

No comments:
Post a Comment