ఒక చూపుడు వేలు,ఈ విస్మృతి పదాల గులాబీలలోంచి
నువ్వు వొదిలివెళ్ళిన ఊపిరి వెంట సాగిపోతుంది
శూన్యంలోకి విసిరివేయబడ్డ నీ దేహాన్ని కానీ
నీ అరచేతుల మధ్య చిక్కుకు పోయిన
నా నాయనాన్ని కానీ
నేను ఇక చేరుకోలేను-
ఇక మిగిలేదంతా చరిత్ర: నువ్విక
ఈ శీతాకాలపు దిగులు మధ్యాహ్నాలలోంచి
తల్లి లేని పిల్లల కళ్ళలోంచి తిరిగి వస్తావు-
నా స్మృతిలో చిక్కుకుపోయిన నీ దేహాన్ని కానీ
అనంతత్వపు సంజ్ఞతో తిరిగివచ్చే, ఒక
ఆదిమ జాడ అయిన మృత్యువుని కానీ
నేను తిరిగి అందుకోలేను-
ఇక ఒక చూపుడు వేలు
ఈ నిదుర రహిత పదాల గులాబీలలో
నువ్వు వొదిలివెళ్ళిన కొన
ఊపిరి వెంట సాగిపోతుంది-

No comments:
Post a Comment