24 October 2013

ఈ రాత్రి, ఇక్కడ

ఈ రాత్రి, ఇక్కడ.

కనుచూపు మేరా చీకటి.


చుట్టూతా చినుకుల సవ్వడి. కిందకి జారే మబ్బుల వాసనా. 


ఈ రాత్రి, ఇక్కడ


ఈ పల్చటి దుప్పట్లో


నా రెండు రెక్కల మధ్య ఒక లేతమంటై, ముణగదీసుకున్న 

ఒక పావురమై 
వొణుకుతుంది 
ఒక హృదయం-

...లబ్ డబ్

లబ్ డబ్

లబ్ డబ్

లబ్ డబ్...

ముసురు తొలగదు

తను నన్ను వీడదు

ఇక చినుకులు నిదురపోయేది ఎన్నడో


ఎవరికీ తెలుసు? 

1 comment:

  1. నా రెండు రెక్కల మధ్య ఒక లేతమంటై ముడుచుకుని
    వొణుకుతుంది
    ఒక హృదయం-
    what a feel? Beautiful...

    ReplyDelete