- ఊయలలానో,నావలానో: ఇట్లా ఊగే చీకటి -
నీకు చెరోవైపున ఇద్దరు పిల్లలు నీ ఛాతీపై తలలు వాల్చితే
ఒక అంచు నుంచి మరో అంచుకి
ఊగుతుంది లోకం - ఒక తల్లి
తన శిశువుకి స్థన్యం అందించి
అలా జోలపాటతో ఊపుతున్నట్టు- ఉదయం నుండి మండిన
నీ కళ్ళు,ఒక లేత గాలిలోకీ
ఓ కలలోకీ తేలిపోతున్నట్టు-
దీవించే అరచేతులు నీ తలను తాకేందుకు వొంగినట్టు ఆకాశం-
దయగల చూపుల లాంటి కొన్ని
నక్షత్రాలూ.ఎక్కడి నుంచో మరి
అన్నం ఉడుకుతున్న సువాసనా
మరి ఆగీ ఆగీ,చెట్లలోంచి నీ పైకి రాలిపడే రాత్రి చెమ్మా,ఇంకా
ఒక అనామక నిశ్శబ్ధమూనూ-
ఇక అప్పుడు నువ్వు నెమ్మదిగా
నీ పిల్లల్ని నీ ఛాతిపై నుంచి తొలగించి,అత్యంత జాగ్రత్తగా వాళ్ళని
పక్కన పరుండబెట్టి, నీ హృదయ
స్థానంలో ఏర్పడ్డ, ఆ పురాగానాల
స్మృతి ముద్రికలను రుద్దుకుంటూ
అతి రహస్యంగా, అతి నిశ్శబ్దంగా,లేచి వెడదామని అనుకుంటావా
సరిగ్గా అప్పుడే, చీకటి ఒడిలోంచి
ఒక చిన్న గొంతు,పాల ధారవలే
గుసగుసల వలే ఇలా అంటుంది -
"...............నాన్నా"

BEAUTIFUL!!
ReplyDeleteదీవించే అరచేతులు నీ తలను తాకేందుకు వొంగినట్టు ఆకాశం-awesome
ReplyDelete