గాలిలో గది. మరి గదిలో చీకటి. వాన విసిరిన
ఆకులు రాలి, ఊగే చెట్లు
ఝుమ్మని నీలో నాలో-
నానిన మట్టిలోంచి, చూరు అంచుల పైనుంచీ
నువ్వూ నేనూ తాగే ఈ
జీవితపు కాంతి జలం-
మరి దా, ఈ రావి చెట్ల కిందకు, వడి వడి అడుగులతో
శరీరాన్ని ఒక గొడుగును చేసి
చిందర వందరయ్యిన జుత్తుతో
నుల్చుని ఉన్నాను నీ కోసం.
మరి తెలుసు కదా నీకు తప్పక
నేనూ, ఈ వానా కురిసేదెన్నడో?
ఆకులు రాలి, ఊగే చెట్లు
ఝుమ్మని నీలో నాలో-
నానిన మట్టిలోంచి, చూరు అంచుల పైనుంచీ
నువ్వూ నేనూ తాగే ఈ
జీవితపు కాంతి జలం-
మరి దా, ఈ రావి చెట్ల కిందకు, వడి వడి అడుగులతో
శరీరాన్ని ఒక గొడుగును చేసి
చిందర వందరయ్యిన జుత్తుతో
నుల్చుని ఉన్నాను నీ కోసం.
మరి తెలుసు కదా నీకు తప్పక
నేనూ, ఈ వానా కురిసేదెన్నడో?
nice-:)
ReplyDelete