ఎవరైనా నీలోకి కాళ్ళు జాపి, శిరోజాలు వెనక్కు తోసుకుని
రెండు చేతులూ భూమిపై అలా ఆన్చి
తలను నిర్లక్ష్యంగా వెనుకకు విసిరి
ఆకాశాన్నీ, ఇళ్ళకు వెళ్ళే పక్షులనీ, అలజడిగా కదిలే ఆకులనీ
అలా నింపాదిగా చూస్తో, చుట్టూ ఉన్న
పిచ్చి మొక్కల పచ్చి వాసనని తమ
గుండెల నిండుగా ఘాడంగా పీలుస్తో
తేలికగా కాళ్ళని నీళ్ళలో ఆడించుకుంటూ కూర్చున్నారా నీలో
ఎన్నడైనా ఎప్పుడైనా? మరేం లేదు
ఒక చిన్న బ్రతికి ఉన్న కాలంలే అది.
రెండు చేతులూ భూమిపై అలా ఆన్చి
తలను నిర్లక్ష్యంగా వెనుకకు విసిరి
ఆకాశాన్నీ, ఇళ్ళకు వెళ్ళే పక్షులనీ, అలజడిగా కదిలే ఆకులనీ
అలా నింపాదిగా చూస్తో, చుట్టూ ఉన్న
పిచ్చి మొక్కల పచ్చి వాసనని తమ
గుండెల నిండుగా ఘాడంగా పీలుస్తో
తేలికగా కాళ్ళని నీళ్ళలో ఆడించుకుంటూ కూర్చున్నారా నీలో
ఎన్నడైనా ఎప్పుడైనా? మరేం లేదు
ఒక చిన్న బ్రతికి ఉన్న కాలంలే అది.
No comments:
Post a Comment