రాత్రంతా నువ్వు లేని నీ ముఖం
జ్వలిస్తుంది, ఎవరో దాచుకుని దాచుకుని వేసుకున్న చితుకుల మంట వలె.
గుసగుసలాడినట్టు ఇక నెమ్మదిగా ఆకులు కదులుతాయి ఈ ఆవరణలో -
నేను వాటిని గాలిలో రెక్కలల్లార్చే
నీ కనురెప్పలనే పిలుస్తాను.ఇక
ఆ తరువాత సుగంధ ధ్రవ్యమేదో ఒలికి, ఇల్లంతా తెరలు తెరలుగా వాసన వేసినట్టు
గోడలపై నుంచి వెలుపలకి వచ్చి
చుట్టూ అల్లుకునే పిల్లల గీతలు-
నేలపై నుంచి పైకి లేచి, కాంతిలో
అంటుకునే, చాచిన అరచేతుల తడి, కొన్ని మాటలూ మరికొన్ని విప్పిచెప్పలేనివేవో ఈ
సమయపు సరస్సుపై నెమ్మదిగా
తూనిగల వలే వాలి, చలనమేదీ
కలిగించక క్షణకాలం అలా ఉండి
ఎగిరిపోయినట్టు, చీకటిలో క్షణకాలం మిణుగురు పురుగులేవో అతవరకూ చూడని
లోకాన్ని కాంతివంతం చేసినట్టు
నువ్వో నేనో మాట్లాడుకున్న ఆ
అర్థం లేని మాటలే శబ్ధాలే మరి
ఇక్కడ కొంతసేపు, ప్రతిబింబాల వలె, అద్దంపై ఒక మంచు పోర ఏదో కమ్మినట్టగానూ-
ఇక దీని తరువాత ఏం జరుగుతుందా
అని నువ్వు అంటే, ఆహ్ మరేం లేదు
కిటికీలు తెరిచి, తలుపులూ తెరిచి
అద్దాన్ని శుభ్రంగా తుడుచుకుని ఆ
ఆద్ధంలో, తాకలేని లోకాలలోకి చేయి చాచి ఒక మనిషి నిద్రకు ఉపక్రమిస్తాడు. అంతే-!

paras division sari ledu.pls correct
ReplyDelete