1
భూమి మీద మిగిలిన ఆఖరి మానవుడు, తపనగా నలుదిక్కులా చూసుకుంటున్నట్టు
దారీ తెన్నూ లేక, తాకగలిగే ఒక అరచేయి లేక
తన నీడనే తాను ఓరిమిగా తాకుతూ కన్నీళ్ళ
పర్యంతం అయినట్టూ తల ఎత్తి చూస్తే కళ్ళలోకి
నిలువెత్తు గునపాల వలే దిగే సూర్యకిరణాలూ, కనుపాపాలని కోసే గాలీ. మరి ఇంతకూ
మనుషులు, తాకగలిగే మనుషులు ఎక్కడ
ఉన్నట్టు?
2
శిధిలాల మధ్య, హృదయాల వంటి బండరాళ్ళ మధ్య, గోడలపై నిలకడగా పాకే లతలు-
నువ్వు వాటిని నీడలు అనవొచ్చు. నువ్వు
వాటిని కరిగిపోని శిలలూ అని అనవొచ్చు-
కొమ్మలలోంచి గూళ్ళు రాలిపోయి, నీకు
ఇరువైపులా గడ్డిపరకలు పీలికలలుగా
తేలిపోయే వేళల్లో, చెట్లపై నుంచి కిందకి
నింపాదిగా దిగివచ్చే సర్పాలు, మరి మెలికలు మెలికలుగా వలయాలు వలయాలుగా-
నువ్వు వాటిని, ఆ గూళ్ళని, నువ్వు ఇన్నాళ్ళూ నిర్మించుకున్న బంధాలని అనుకోవచ్చు
నువ్వు వాటిని, ఆ గడ్డిపరకలని, చేతికీ
చేతికీ మధ్యన ఏర్పడిన ఒక దూరమనే
పిలవొచ్చు. ఇరువురూ గడపలేని ఒక
విపత్కాలాన్నే, నువ్వు ఆ సర్పాలుగా
భావించ వచ్చు, ఆ కాంతిరహిత వలయాలని నువ్వు కాలంగానే భావించవచ్చు. మరి
ఇంతా చేసీ, ఇంతా అనుకున్నా, మారేదేమిటి?
3
తల వంచుకుని, అరచేతుల మధ్య ముఖాన్ని కుక్కుకునీ, సమాధి చేసుకునీ, మరిక
అరచేతులలో చిట్లిన చెమ్మలో, చెమ్మతో
ఈ నాలుగు చిన్న మాటలని, తన తోటి
తనకు లేని మనిషికై రాసుకునే మనిషి-
ఏమని పిలుస్తావు నువ్వు అతనిని? సరే
ఇలా ఒక కవిత అని కూడా అనుకుందాం
ఇప్పటికి:
నువ్వు వొదిలి వెళ్ళాక, తిరిగి నువ్వు వస్తావని, చీకటింట ఒక తల్లి పొయ్యి వెలిగించుకుని
కుండలో ఇన్ని నూకలూ నీళ్ళూ పోసి
ముడుచుకుని కూర్చుంటే, ఎగిసిన ఆ
మంటల్లోంచి గతజన్మలూ గత ప్రేమలూ
తన అనేక జననాలూ, అనేక మరణాలూ, ఇంకా మోయవలసిన అనేక జీవితాలూ చిమ్మాయి-
అనేక శిశు జననాలూ, అనేక గర్భస్రావాలూ
చివికి పిగులుతున్న ఈ శరీర మందిరంలో
తనకి అనేక కాంతి నదులూ కనిపించాయి-
మరి, అంతా చూసీ ఒక నిర్లిప్తతతో ఎదురు
చూసీ చూసీ, తను అక్కడే నిదురోయింది-
అన్నం ఉడికింది కుండ కాలిపోయింది మరి
నిప్పూ నివ్వెరపోయి ఆరిపోయింది. ఇంతా చేసి, వెళ్ళిన వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు. అరచేతుల్లో
దిగబడిన ముఖాన్ని ఎవరూ వెలికి తీయలేదు-
4
భూమి మీద మిగిలిన ఆఖరి మానవుడు, ఒక శరీరంకై, ఒక మాటకై, ఒక స్త్రీ స్పర్సకై, నీడలని
తవ్వీ తవ్వీ వెదుకున్నట్టు, తనకు
గర్భం లేదనే ఎరుక తొలిసారిగా కలిగి దుక్కించినట్టూ, తాను ఎప్పటికీ గర్భం కాలేనందుకూ
ఈ ధరిత్రిని చెరిచి చంపివేసినందుకూ
ఒక్కడుగా మిగిలి, ఒక్కడుగా రోదించీ
గుండెలను చరచుకుని చరచుకునీ చూస్తే
అంతా ఒక చీకటి శూన్యం, ఒక కృష్ణ బిలం-
5
మోకాళ్ళ మీద ఒరిగిపోతూ మరి నువ్వు
అనుకో అప్పుడప్పుడూ ఇలా, ప్రార్ధించు
అప్పుడప్పుడూ నువ్వు ఇలా:
'నాలుగు మాటలు మాట్లాడే మనిషిని ఆశించే కంటే, వెదికే కంటే, ఎదురుచూసే కంటే, మరి
గోడలకి మేకులు కొట్టుకోవడం చాలా సుఖం.'
నేను ఏం సూచిస్తున్నానో, అర్థం అవుతుందా
నీకు? చేతులలో మేకులతో ఇనుప దిమ్మెతో
అక్కడ వేచి చూస్తున్న నీకు?
6
తిరిగి రా ఇంటికి. అద్దాలు లేని పూలనీ మరి
పక్షులనీ, గాలినీ, వాననీ, వెన్నెలనీ, చీకటినీ
చీకటి వాసన వేసే ఉదయాలనీ, ఉదయాల వాసన వేసే ఉమ్మ నీళ్ళనీ, కన్నీళ్ళనీ నీతో కలిపి
కడుపుతో ఉన్నాను ఇక్కడ. విన్నావా నువ్వు?
విను, ఇక ఒక ఆఖరి పంక్తిని-
7
Amen.

No comments:
Post a Comment