"నువ్వు ఏమైపోయావో తెలియదు, ఎప్పుడు వస్తావో తెలియదు
ఇలా ఎలా? కనీసం పిల్లలకైనా మిగలవా?" అంది తను అలసటగానూ
మరి కొంత విసుగుతోనూ. కూర్చున్నాడు అతను
మాట్లాడకుండా బాల్కనీలో, గోడలపై కదిలే నీడలనీ
అల్లుకున్న తీగకి, ఆకస్మికంగా వీచిన ఒక చిన్న గాలికి కదులాడే ఆకులనీ
చూస్తూ: ఆ తరువాత నెమ్మదిగా
అడుగుతాడు అతడు: "దీనిని మనీ ప్లేంట్ అని ఎందుకు అంటారో తెలుసా నీకు?"
ఇక అప్పుడు
ఎవరో ఆ చీకట్లో, బావిలోకి బిందెను ముంచిన
చప్పుడు. దూరంగా, అతను తరచూ కలగనే
తనలోనే తనకు మాత్రమే తెలిసిన ఒక రహస్య ప్రదేశంలో అలలు అలలుగా
వీచే రావి కొమ్మల అలజడీ. భూమిపై నుంచి
సాయంత్రంలో చిన్నగా మట్టి లేచి, అలా కాగితంలా గాలిలో తేలి, తిరిగి నెమ్మదిగా
నేలపైకి సర్దుకునే ఒక చిన్న సందడి. కొంత
నిర్లిప్తతా కొంత శాంతీ ఇంకొంత అలసటానూ-
ఇక నెమ్మదిగా చీకట్లోంచి లేచి, కనురెప్పలకి అంటుకున్న నిన్నటి రాత్రిని
ముంజేతులతో తుడుచుకుంటూ ఇలా అడుగుతాడు
అతడు చిన్నటి గొంతుతో -
"పడుకున్నారా పిల్లలు? అడిగి ఉండను ఎన్నడూ కానీ, ఇంతకూ అన్నం
తిన్నావా నువ్వు?"

No comments:
Post a Comment