సరే, ఇటు చూడు:
నువ్వు రాసిన, మరి నేను దాచుకున్న
గత జన్మల అతి నవీన లేఖలన్నిటినీ దరి చేర్చి
ఓపికగా, నీ మోముని అరచేతుల్లో పుచ్చుకుని, ఇక
ఒకసారి ఆఖరిసారిగా చూసుకుని వొదిలి వేసినట్టు
ఈ రహస్య భాషల, నీ శరీరం వొదిగిన కాగితాలని
నెమ్మదిగా ముక్కలు ముక్కలుగా చించి, పోగేసి
మంట పెట్టి చూస్తూ కూర్చున్నాను: గాలికి ఎగిసి, మరి
ఆ గాలికే నింగికి తేలే నల్లటి నుసి వలే, నిప్పురవ్వల వలె-
కొబ్బరి చెట్ల మధ్యగా వికసించే జాబిలిని కానరాని, చెట్లు లేని
ఈ ఆధునిక వీధులలో
దారి పక్కగా రాత్రంతా ఊళ పెడుతూ ఇక అతనూ
ఇళ్ళు లేని వీధి కుక్కలూనూ- ఇక ప్రేమ గురించి
మాట్లాడేందుకు
నేను ఎవరు, నువ్వు ఎవరు?

No comments:
Post a Comment