రెండు జాజి పూవులను అరచేతులో పుచ్చుకుని వచ్చాను
కానీ నువ్వు ఉంటావో లేదో నాకు ఎలా తెలుసు?
అందుకని కొన్ని ముళ్ళగుచ్చాలను కూడా తెచ్చుకున్నాను
ఎదురుచూస్తూ కళ్ళలో అమర్చుకునేందుకో
శిరస్సుపై కిరీటంలా పేర్చుకునేందుకో=
ముళ్ళ కిరీటం, పూల రక్తం: అదే నేను ఇప్పటిదాకా.
వచ్చి చూసిపో ఒకసారి.
No comments:
Post a Comment