01 March 2011

నువ్వు ఒక్కడివే

రాత్రి
ఇంకా వర్షం
రుతువు ఒక్కటే
వర్షపు
రుతువు ఒక్కటే
ఉన్నట్టు

రాత్రి
ఇంకా వర్షపు కాంతి
నారింజ రాత్రి కాంతి
చెట్లకు పైగా
చెమ్మగిల్లిన దయతో
హింసతో
నిన్ను
శపిస్తూ=

నువ్వు ఒక్కడివే
రాత్రి అంతా
రాలిపడే పక్షులను
గుణిస్తూ
నీలో నువ్వు
గొణుక్కుంటూ

నిస్సిగ్గుగా
నిస్సహాయంగా
ఇంకా వాళ్ళను
తలుచుకుంటూ

నిశ్సబ్దంగా
నిరీక్షణలో ఇంకా
ఇప్పటికీ

నువ్వు ఒక్కడివే=

1 comment:

  1. Birds of same feather-2


    ఒక్కడివంటావేం?

    నిశ్శబ్దంలో స్వగతం
    వెచ్చగా చెంపపై
    జాలువారుతుంటేనూ

    నిరీక్షణలో జ్ఞాపకం
    చేయి వదలని
    పాణిగ్రహణం చేస్తేను

    ఆ సహచార్యాన్నుంచి
    నేర్చుకుని కాదూ
    నిస్సహాయతా నిర్లజ్జ
    నీ నీడలయినై

    ఈ స్థితి ముందు
    చూసావా నువ్వసలు
    రేలో రాలే రావాల
    ఆ స్వేచ్చా పయనం

    మౌనం, నల్లదుప్పటి....
    ఓహ్!అనిపించలా ఎప్పుడూ?

    ఆ జ్ఞానప్రాప్తికే కాదూ
    ఒక్క క్షణంలో
    నీ జుట్టు తెల్లబడటం
    గునగటం అలవాటవటం?

    నిజమే
    కృష్ణపక్షమంతా
    వర్ష ఋతువే
    కృష్ణవత్సరం ఆనాలా
    కృష్ణశాస్త్రిగారూ దీన్ని?
    చిక్కని ఆ కృష్ణవేణిలో
    ఆరింజ కూడా ఉందా?
    కృష్ణయ్యా
    ఎక్కడ చూసినా
    నీ చాయే!

    భావోద్వేగంలో
    కంటిపాప
    ఒంటి కోకను
    లాగి చెట్లకా?
    అవ్వ దుశ్శాసనా!
    చేమ్మగిల్లాయా చెట్లు?

    తనను
    శపించటం
    హింసా
    దయా
    ఎవరికీ?

    అంతర్ముఖం
    బిలంలో
    కనుగానదు.
    బయట
    వినాయకులెందరో!
    అనింజుడివా
    బిలంలో కబోదివా?

    ఎంత కావలించుకున్నా
    ఒంటరితనం
    ఏకాంతం
    చలికాచవు

    నావి
    పళ్ళు ఇంకా
    కొట్టుకుంటూనే ఉన్నాయ్
    Brrrrrrrr
    పద బయటకు.

    ReplyDelete