నిద్దురలో పక్కకు ఒత్తిగిల్లి
నా చేతి వేళ్ళను మెత్తగా నీ అరచేతులోకి లాక్కుంటావు
నువ్వు -
ఎవరో
సడీ సవ్వడి లేకుండా
నన్ను తమ కలలోకి లాక్కు వెళ్లినట్టు, కిటికీలు తెరచి
రాత్రి సుగంధాన్ని
లోపలికి
మంచుపొగతో పంపించినట్టు
మైదానాలపై తూనీగలు ఎగిరినట్టూ నా చుట్టూతా నీ
చేతివేళ్ళ సుగంధం:
చీకటి తొలిగి
వెన్నెలలో ఆ కాంతిలో
ఆకులు మెరిసినట్టు, పూలు ఊగినట్టు, నాలో ఏదో ముడి
వీడి
స్పష్టంగా మారిన
జలదరింపు: ఏదో ఎరుక -
తేలికపాటి వర్షంలో తడచిన ఒక ఆనందం. తొలిసారిగా
నిన్ను విభ్రమంతో
చూసినట్టు -
నిద్దురలో పక్కకు ఒత్తిగిల్లి
చాలా పొందికగా నన్ను నీ అరచేతుల్లోకి లాక్కుంటావు
నువ్వు -
ఇక తిరిగి నిద్రించలేక
నీ పసి చేతిని అలాగే పుచ్చుకుని ప్రార్ధిస్తాను నేను: నా
చేతిని నువ్వు
ఎప్పటికీ వదలవద్దనీ
నువ్వు చూపించిన దారిని నేను ఎన్నటికీ మరవకూడదనీ
బ్రతుకనిమ్మనీ!

No comments:
Post a Comment