నువ్వు
రాత్రి ఇంటికి చేరుకునే సరికి, చీకటి నదిలో నెమ్మదిగా లాంతరు
కాంతిలో సాగే పడవలా
ఇల్లు -
తన చేతివేళ్ళ సువాసన ఇంకా తార్లాటలాడే - దగ్గరిగా వేసి ఉన్న
తలుపు. మసక కాంతిలో గదుల్లో
కదిలే పూలవంటి నిశ్శబ్దం.
తెరచిన బాల్కనీ కిటికీలోంచి నిదురించే పిల్లల శ్వాస వంటి గాలి.
డైనింగ్ టేబుల్పై నీకోసం ఉంచిన
అన్నం పాత్రా, బోర్లించిన
ఒక ప్లేటూ, గాజు గళాసూ, చేయి తుడుచుకునేందుకు ఒక నాప్కిన్ -
ఆపై పడుకునేందుకు సిద్ధం చేసిన
మంచంపై, మడత పెట్టిన ఒక
కంబళీ, మంచం పక్కగా చీకట్లో నువ్వు లేస్తే నీకు తేలికగా అందేలా
ఒక నీటి బాటిలూ, ఇంకా ఉదయాన్నే
వెలుతురు నిన్ను చెదపకుండా
కిటికీలను మూసిన మందపాటి కర్టెన్లూ:
నువ్వు
రాత్రి ఇంటికి చేరుకునే సరికి, చీకటి నదిలో నెమ్మదిగా లాంతరు
కాంతిలో సాగే పడవలాంటి
ఇంటిలో
ప్రతిదీ సర్ధబడి
అన్నీ ఎక్కడివక్కడే అమర్చబడీ, పొందికతో, అలసటతో అలా
నిదురించిన తన శరీరపు
చెమ్మతో
బహుశా, ఆ నిశ్శబ్ధంలో
నువ్వు ఇన్నాళ్ళూ వినలేని స్వరాలతో, తన ఆత్మంతా నిండిన
అరుపులతో -
మరి ఇక
నువ్వు అన్నం
తినే వేళకి, అన్నీ అట్లా ఎట్లా సమకూర్చబడ్డాయో, ఆ ప్రక్రియ
ఏమిటో
ఒక్కసారైనా నీకు
తడితే, నువ్వీ జన్మకి విముక్తి
చెందినట్టే!

No comments:
Post a Comment