నీ తలుపులు తెరుచుకోవు -
సాయం సంధ్య.
హృదయాలని వణికించే గాలి.
రాత్రి తేమ ఏదో ముందుగానే ఈ పెదిమల పైన -
వేణువై
నువ్వు ఉండాల్సిన ఈ పెదిమల పైనే -
అన్నీ వెళ్ళిపోయేవే.
తలుపులు తెరిచో మూసో, ముందుగానో వెనుకగానో -
ఆపటానికి
నేనెవరిని?
సరే.
గాలి శోకం
పూల భాషా నీడల విన్నపం
నీకు
అర్థం కావు -
దానికి
నేనేం చేయను?
సాయం సంధ్య.
హృదయాలని వణికించే గాలి.
రాత్రి తేమ ఏదో ముందుగానే ఈ పెదిమల పైన -
వేణువై
నువ్వు ఉండాల్సిన ఈ పెదిమల పైనే -
అన్నీ వెళ్ళిపోయేవే.
తలుపులు తెరిచో మూసో, ముందుగానో వెనుకగానో -
ఆపటానికి
నేనెవరిని?
సరే.
గాలి శోకం
పూల భాషా నీడల విన్నపం
నీకు
అర్థం కావు -
దానికి
నేనేం చేయను?
No comments:
Post a Comment