బ్రతకడం ఎలా, అతను అడిగాడు, దిగులుగా -
చెదిరిపోయిన గూడులా, ఇల్లు పీలికలుగా -
వస్తువులపై, ఒకరికి ఒకరు ఒకప్పుడు ఇష్టంగా బహుమతిగా ఇచ్చుకున్న
పింగాణీ బొమ్మలపై
పుస్తకాలపై, గాజు పాత్రలపై, దుస్తులపై
అల్మారాలో - నవ్వే దినాల ముఖాల ఫోటోలపై, తెరవని కిటికీలపై పొరలా
పేరుకున్న దుమ్ము -
బ్రతకడం ఏలా, అతను మళ్ళా అడిగాడు, బహుశా
ఈసారి ఒకింత నిస్సహాయంగా -
ఇక
తను తెరచిన తలుపులలోంచి ప్రసరించే
ఆ శీతాకాలాంతపు సూర్యరశ్మిలో, దుమ్ముని తుడిచీ, దుస్తులనీ పాత్రల్నీ సర్దీ
ఎన్నాళ్ళుగానో
నీళ్ళు లేక వడలిపోయిన మొక్కలకి
నొచ్చుకున్న ముఖంతో ఇన్ని నీళ్ళు తాపిస్తూ, ఒరిగిన పూలని చిన్నగా తాకుతూ
తను ఏమీ మాట్లాడలేదు!

అద్భుతంగా ఉంది శ్రీకాంత్ గారు
ReplyDeleteఅద్భుతంగా ఉంది శ్రీకాంత్ గారు
ReplyDelete