"How was the day?" అని అడుగుదామని అనుకుంటాడు అతను
తనని -
వాన వచ్చే ముందు వీచిన ఈదురు గాలికి
ఎక్కడో తెగిపోయి, ఇక్కడికి
కొట్టుకు వచ్చి, వాలిపోయిన
ఒక మృదువైన, నిదురలోకి ముడుచుకుపోయిన
ఓ పసి పిడికిలి వంటి
ఆకునీ, తననీ కూడా-
నిస్సత్తువుగా కుర్చీలో జారగిలబడి, భుజాన బ్యాగుని పక్కకు వొదిలి
కళ్ళలోని వాననీ
శరీరంలో వడలిన
పూలనీ, రేగే ధూళినీ తుడుచుకుంటూ, సొమ్మసిల్లుతోన్న నవ్వుతో
అతి కష్టం మీద
ఇలా అంటుంది
తను అప్పుడు-
అతనితో:
"కొద్దిగా, ఓ గ్లాసు మంచినీళ్ళు అందిస్తావా?"

No comments:
Post a Comment