రాత్రంతా నువ్వు లేకుండా ఒక్కడినే కూర్చుని తాగాను -
ఏం చెప్పను? కరకు శీతాకాలం.
మనుషులు పగిలిన పెదాలై, మాటలై, కొమ్మ నుంచి తెగి
నీ చుట్టూ ఆకులై రాలే కాలం -
చుట్టూ ఎవరూ లేరు. సమాధిలోంచి తొలుచుకు వచ్చిన
కొన ఊపిరితో బ్రతికి ఉన్న
ఒక చేయి వలే ఈ రాత్రి -
బరువెక్కిన నయనాలూ
అలసిపోయిన చేతులూ-
ఎవరో ఇంతకాలమూ త్రవ్వీ త్రవ్వీ, ఎటువంటి నీటి జాడా లేక
వొదిలి వేసిన ఈ శరీరం ఇక
ఒక పాడుబడిన కుటీరమూ
ఎవరూ అడుగిడని భూమీ-
ఎవరికి చెప్పను, కన్నీళ్ళూ మంచి నీళ్ళేనని, మనిషి లేక
మరొక మనిషి మన్నలేడనీ
తానే ఇతరమనీ? ఇతరమే
తాను అనీ, ఇతరమే మనం అనీ? మనమే సర్వస్వం అనీ?
ఒరే నాయనా, కవీ, కసాయీ
వెన్నెల పూలతో ఊగిపోయే
స్నేహ పాత్రాధారీ, బాటసారీ
ఏమీలేదు. రాత్రంతా ఒక్కడినే కూర్చుని త్రాగాను. ఎదురుచూసాను -
అయిపోయింది ఈ హృదయం ఖాళీగా.
రాత్రేమో వచ్చి వెళ్లిపోయింది
సవ్వడి లేకుండా, రికామీగా-
అది సరే కానీ, మరి ఇది చెప్పు, నువ్వు నాకు-
నువ్వు వచ్చి, ఈ అరచేతుల మధ్య సప్త రంగుల వసంత వనాలై
ఒక సుగంధపు మధుపాత్రై
ఒదిగి ఒదిగి పోయి, నన్ను
నువ్వూ, నిన్ను నేనూ, బ్రతికించుకునేది ఎన్నడు?

No comments:
Post a Comment