03 August 2011

వెళ్తున్నాను దూరంగా

నిన్ను నమ్ముకోలేను
అమ్ముకోలేను

నిన్ను ఉంచుకోలేను
వదిలివేయలేను

నిన్ను హత్తుకోలేను
మరచిపోలేను

నిన్ను పిలవలేను
అలా అని వినలేను

నిన్ను చూడలేను
ఏమీ చూపించలేను

మరువక, కను
మరుగవ్వక
గూడు లేక గువ్వ
కువకువ
బెంగగా గుండెలో=

నువ్వు విన్నావా
దిగులు చినుకులు
దిగే సవ్వడి

ఆకులపైనుంచి
ఆకాశంలోంచీ

చితాభస్మం
చింతలలోంచీ
చితులలోంచీ:

నేత్రమే పాపం
పాపమే పుణ్యం.
ఏమీలేదు

వెళ్తున్నాను
దూరంగా

ఒక వెన్నెలనుంచీ
నా నుంచీ=

1 comment:

  1. శ్రీకాంత్ గారు

    మరువక, కను
    మరుగవ్వక
    గూడు లేక గువ్వ
    కువకువ
    బెంగగా గుండెలో=

    .............చుట్టకు అగ్గి దొరికిందని సంబర పడ్డ చందాన ఈ పంక్తుల్లో ఏదో తెలియని లయ కనపడింది, ఎంతో అందంగా. thanks

    ReplyDelete