విస్మృతి -
తన వేలితో తాకబడిన ఈ రాత్రి చెలమలో - పూలవర్ణాలు. ఇక
ఎవరిదో శ్వాస అతని నయనాల్లో
చంద్రబింబమై -
స్మృతి -
ఎవరిదో ఒక మాట ఈ చెట్ల మధ్య వేణువై, వెదురు వనాల
పరిమళమై,వొణికే తన అరచేతుల్లో
ఒక ప్రమిదెయై -
మెలకువ -
ష్: నిశ్శబ్ధం. మాట్లాడకు: గుర్తుకు తెచ్చుకుంటున్నారిద్దరూ
వెన్నెల రంగుల వేణుగానాన్నీ ఒక
దీప దాహాన్నీ!
No comments:
Post a Comment