సాంధ్య సమయాన
ఒక స్మృతి ఏదో నీలో:
నెలలు నిండని కడుపులోని బిడ్డ హటాత్తుగా కదిలినట్టూ కలవరపెట్టినట్టూ
ఇక అక్కడే
ఆయాసంతో కూలబడి
నువ్వు ఆ చల్లటి గాలిలో పల్చటి చీకటి తెరలలో పొట్టపై చేయి వేసుకుని
జలదరింపుతో
దూరంగా ఒక ఇంటిలో
మిణుకు మిణుకుమనే దీపపు కాంతిని తదేకంగా చూస్తూ మిగిలినట్టూ
ఒక స్మృతి ఏదో
నీలో
ఉగ్గబట్టిన నొప్పైతే
ఇక
ఆ పూటంతా నీలో
సగం అల్లిన స్వెట్టర్ వాసన. పాత దుప్పటి ముక్కలతో ఇష్టంగా
చేసిన
ఒక చిన్న పరుపు -
నువ్వు జాగ్రత్తగా ఎంపిక చేసుకుని కొనుక్కుని వచ్చిన చిన్నచిన్న
బొమ్మలూ
అల్లుకున్న ఓ ఊయలా
చలించే నీ మట్టి గాజుల శబ్ధంతో, నీలో కదిలే నీటి చెలమల అలికిడితో
అట్లా
నిరంతరాయంగా
ఊగుతూ
ఊగుతూ
ఊగుతూ -

No comments:
Post a Comment