పదం -
నెత్తురులో ఒక పదం: నువ్వు.
పదం నెత్తురై ఒక మొగ్గై పుష్పించే మంచుగులాబీ పూవువి
నువ్వు
వాక్యం -
ఎందరివో కన్నుల పవిత్ర జలం:
నువ్వు. వాళ్ళ హృదయాలలో లంగరు వేయబడి అలా తేలికగా
ఊగే
నువ్వు. వాళ్ళ హృదయాలలో లంగరు వేయబడి అలా తేలికగా
ఊగే
లయబద్ధమైన శ్వాసవి
నువ్వు -
నువ్వు -
అంతం -
ఇక
దినానంతాన
నీలోనూ నీ పదాల మధ్య నిశ్శబ్ధంలోనూ పూర్తిగా మునిగి
ఒక దివ్యకాంతిలో
కనుమరుగయ్యెను
అతను -
ఇంతకూ
శ్రీకాంత్ అనేనా
నువ్వు అతనిని, కపోతాలు కలకలంతో నింగికెగసే వేళల్లో
తడబడుతూ
పిలిచినది?
No comments:
Post a Comment