రాత్రి -
మూసిన కిటికీలతో
ఇల్లు: సాయంత్రం గడప ముందు బెంగటిల్లిన కళ్ళతో ఎదురుచూసే
ఓ పాపై -
ముసురు -
మరెక్కడ నుంచో
నింపాదిగా అవిసె చెట్లపై నుంచి వీస్తో పల్చటి పొగై నీలోకి వ్యాపించే
మంచు:
సమయం -
ఎవరినో స్మరిస్తూ
నీ బల్లపై వెలిగించని దీపం వద్ద నిస్త్రాణగా వాలిపోయిన రెండు అర
చేతులు -
(ఆ) తరువాత -
అవును. నువ్వు
ఊహించిందే నిజం: మసి పట్టిన బుగ్గలతో ఎండిన నీటి చారికలతో
విరిగిన
ఒక బొమ్మని
గట్టిగా హత్తుకుని ఎదురుచూసే ఆ పాప వద్దకు రాలేదు ఎవ్వరూ
వడలిన
ఆ పూరేకును
చిన్నగా తమలోకి పొదుపుకుని - ఒక జోలపాటై ఒక తల్లి మాటై -
మెత్తగా
పలుకరించేందుకు!

No comments:
Post a Comment