గాలి -
నా శ్వాసలోంచి
పూచే నీ రాత్రి: నీలోంచి ఎగిరి వచ్చి నన్ను నింపే ఒక
పూల తావి -
చూపు -
నీ శరీరంలో తేలే
నా వేకువ నావ: నీలోంచి ఎగిరి వచ్చి నన్ను నింపే ఒక
అత్తరు కల -
బ్రతుకు -
మన మధ్య వొణికే
ఒక రహస్య దేహ దీపం: స్పర్శ. గుమికూడే నీడలూ కోరికా
చీకటీ విచిత్రం
ఒక గగుర్పాటూ
మనం: అవిభక్త కవలలం, పరస్పర పరిమళం: మనం. ఇంకా
అతనూ
ఆమె -
ఇక - అందుకని
పట్టించుకోకు నువ్వు ఎవ్వరినీ: మరణించేందుకు మనకు
ఈ వేళ ఇక
ఎవ్వరి పదాలూ
అవసరం లేదు -
amen.

chaaala bagundi
ReplyDelete