నువ్వు వచ్చి వెళ్లిపోయావని
తెలిసిపోతూనే ఉంటుంది: నేను భద్రతతో మూసిన కిటికీలు
తెరచి ఉండటంలో -
అప్పుడిక గదుల్లో
నేలపై తార్లాటలాడే గాలిలో చెట్లు తడచిన నీ కురుల వాసన:
పెరట్లో ఆరేసిన తువ్వాలుపై నీ దేహ దీపకాంతీ
పొగ: ఇంకా సుదూర శబ్ధాలేవో -
ఆ కాంతిలో, ఆ పొగలో
నువ్వు వొంపిన నీళ్ళతో తిరిగి బ్రతికిన మొక్కలూ, పూలూ
పిట్టలూ, కీటకాలూ, చివరిగా, మన నాలుగు
గోడలూ, నీడలూ, నేనూ -
నువ్వు వచ్చి వెళ్లిపోయావని
తెలిసిపోతూనే ఉంటుంది: నువ్వసలు నాకేమీ చెప్పకపోయినా -
సరిగ్గా ఎలా అంటే
వాన వెలిసిన దారిలో
పురాస్మృతుల్లో నడుస్తూ ఒక మనిషి, చీకట్లో చెట్లు వణికి
రాల్చిన జల్లుకి జలదరించి, సుషుప్తిలోంచి
ఇప్పటిలోకి మేలుకున్నట్టు -

No comments:
Post a Comment