ఇక గది అంతా
అప్పుడే ఊడ్చిన శుభ్రతతో, ఉదయపు కాంతితో దయతో
సర్దిన వాటన్నిటిలోనూ
ఆకుపచ్చనిదనం. అలలుగా ఆకులు కదిలే సన్నటి అలికిడి. గాలి. నేలపై
నీరు నవ్విన మెరుపు. సుగంధం. ఇష్టం ~
ఇక ఇల్లేమో
ఒక గూడుగా మారి, మెడల కింద ముక్కులతో పొడుచుకుంటూ పిట్టలు
ఆ గూటిలోంచి గూడు గురించి నీకేదో విడమర్చి
చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్టు ~
సరే. గది అంతా
అప్పుడే ఊడ్చిన ఆనందంతో, జీవన ఉత్సాహంతో, క్షమతో
ఇక మంచం దిగుతూ అతను
ఇలా తలపోస్తాడు: "నన్ను శుభ్రపరచే రెండు చేతుల అర్హతను మరి నేను
ఎన్నటికని సంపాదించుకోగలను?"

No comments:
Post a Comment