1
2
3
చీకటిలో
నువ్వు దీపం వెలిగించినప్పుడు నేను లేను కానీ
కొద్దిగా రెక్కలు విప్పిన
తెల్లని పావురంలా మారిన మన గూటిని నేను
ఊహించగలను 2
నేను
వచ్చేటప్పటికి నువ్వు ఉండవని నాకు తెలుసు
నీకూ తెలుసు -
అయినా
వెలిగించి వెళ్ళడంలోనే నాపై నీ ఇష్టం దాగి ఉందనీ
అదే జీవన సూత్రమనీ
అదే నీ ఇంద్రజాలమనీ
ఎందరికి
తెలుసు?3
నేను
వచ్చేటప్పటికి నువ్వు లేవు: నువ్వు వెలిగించి ఉంచిన
కాంతి వలయంలో
నీ
శరీర సుగంధం. సన్నగా చలిస్తూ కదిలే సెగలో నీ
పసుపు పచ్చని ముఖం -
వండి ఉంచిన
పాత్రలో
మెతుకుల్లాంటి నీ మాటలు. బల్లపై ఉంచిన
మంచి నీళ్ళ గాజు పాత్రలో
నీ మౌనం -
తెరచిన
కిటికీలలోంచి చల్లటి రాత్రి గాలి. ఇక ఎప్పటిదో మరి
నీ సన్నటి నవ్వు
ఇప్పుడు
ఇక్కడ
చీకటిలో మిణుగురై మెరుస్తోంది -
4
చీకటిలో
నువ్వు దీపం వెలిగించినప్పుడు నేను లేను కానీ
కొద్దిగా
బెంగటిల్లి
రెక్కలు నిక్కబొడుచుకుని ఉర్ర్ ఉర్ర్ మంటూ
గూట్లో
అక్కడక్కడే
మెసిలే ఊదా రంగు పావురంలా నేను: తోడుగా
ఈ అక్షరాలూ -
అది సరే కానీ
అది సరే కానీ
5
మరి
నువ్వు తిరిగి వచ్చేదాకా, వచ్చి తాకి శ్వాస అందించేదాకా
మేమంతా
ఏం చేయాలో
ఎలా ఎదురు చూడాలో చెప్పడం
ఎలా మరచిపోయావు
నువ్వు?
baagundi maree..nuvee levugaa..
ReplyDeleteచీకటిలో
ReplyDeleteనువ్వు దీపం వెలిగించినప్పుడు నేను లేను కానీ
కొద్దిగా
బెంగటిల్లి
రెక్కలు నిక్కబొడుచుకుని ఉర్ర్ ఉర్ర్ మంటూ
గూట్లో
అక్కడక్కడే
మెసిలే ఊదా రంగు పావురంలా నేను... <3